- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సినిమా షూటింగ్లో గాయపడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం ఆపరేషన్ జరిగింది. అయితే ఆయన తాజాగా ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన వైద్యుల బృందంతో దిగిన ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ చేతికి బెల్ట్ ధరించి, విక్టరీ సింబల్ చూపిస్తూ కనిపించారు. ఆయన పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి రావడానికి 2 నుండి 3 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
- Advertisement -



