Thursday, August 13, 2026
E-PAPER
Homeజాతీయంమీరు చేయలేకపోతే, మేమే అమలు చేసేలా చూస్తాం: సుప్రీం కోర్టు

మీరు చేయలేకపోతే, మేమే అమలు చేసేలా చూస్తాం: సుప్రీం కోర్టు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల లేబుళ్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది. “మీరు చేయలేకపోతే, మేమే అమలు చేసేలా చూస్తాం” అంటూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయంలో తుది నిర్ణయం తెలియజేయడానికి కేంద్రానికి రెండు వారాల గడువును మంజూరు చేసింది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముందు భాగంలో హెచ్చరిక లేబుళ్లను తప్పనిసరి చేయడంలో జరుగుతున్న జాప్యంపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)పై ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించింది.

ఇది ప్రజల, ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన కీలకమైన అంశమని, కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి తలొగ్గి నిర్ణయాలు తీసుకోవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. “తయారీదారులు తమ వ్యాపారం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఈ లేబుళ్లను వ్యతిరేకించవచ్చు, కానీ తాము కొనుగోలు చేసే వస్తువులో ఏయే పదార్థాలు ఉన్నాయో తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది” అని కోర్టు వ్యాఖ్యానించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -