Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం

పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం

- Advertisement -

– సర్పంచ్ కన్నయ్య గారి లక్ష్మి..
నవతెలంగాణ – తొగుట 

పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ కన్నయ్య గారి లక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని గుడికందుల గ్రామంలో మహిళ సమాఖ్య భవన నిర్మాణానికి సర్పంచ్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళ సమాఖ్య భవన నిర్మాణానికి ప్రభుత్వం ఎన్ఆర్ఈజిఎస్ రూ. 10 లక్షల నిధులను మంజూరు అయ్యాయని తెలిపారు. ఆ నిధుల ద్వారా భవనం నిర్మాణం చేసేందుకు భూమి పూజ చేసినట్లు పేర్కొన్నారు. పనులను వెంటనే ప్రారంభించి, పూర్తిచేసి మహిళలకు అందుబాటులోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. పార్టీలకతీతంగా నాయకులు గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి, ఉప సర్పంచ్ పైర పర్శయ్య, పిఆర్ ఏఈ ఇర్ఫాన్, పంచాయతీ కార్యదర్శి రవి, మహిళా సంఘం సభ్యులు, నాయకులు, గ్రామస్తు లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -