Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొండి బకాయిలకై బ్యాంకర్ల గ్రామాల పర్యటన

మొండి బకాయిలకై బ్యాంకర్ల గ్రామాల పర్యటన

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఎల్ టీ రుణాల మొండి బకాయిల రికవరీకై మద్నూర్, డోంగ్లీ మండలాల పరిధిలోని గ్రామాలలో పర్యటిస్తున్నామని ఎన్డీసీసీబి బ్యాంక్ మేనేజర్ సాయిలు తెలిపారు. ఈ క్రమంలో గురువారం నవతెలంగాణ విలేకరి బ్యాంకు రికవరీ అధికారి సందీప్, మద్నూర్ బ్యాంకు మేనేజర్ సాయిలును కలిసి వివరణ కోరారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మాట్లాడుతూ.. మద్నూర్ సింగిల్ విండో పరిధిలో దాదాపుగా రూ. 2.5 కోట్లు, డోంగ్లీ సింగిల్ విండో పరిధిలో రూ.50 లక్షలు, రెండు మండలాల పరిధిలో మొత్తం రూ.3 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఎల్టి రుణాలతో పాటు కర్షకమిత్ర లోన్లు పొందిన రైతులు కొందరు సకాలంలో రుణాలు కట్టడం లేదని, అలాంటి వారు కూడా తమ కిస్తుల ప్రకారం రుణాలు చెల్లించి బ్యాంకులను ఆదుకోవాలని కోరారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వారు సకాలంలో సొమ్ము చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల బ్యాంకు నియమ నిబంధనల ప్రకారం అధిక వడ్డీ కట్టవలసి వస్తుందని చెప్పారు. అందుకే సకాలంలో అసలుతో పాటు వడ్డీ చెల్లించి, ఆర్థిక భారం కాకుండా చూసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -