- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలోని నాందేడ్‌లో శిరోమణి అకాలీదళ్ అధినేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై గురువారం దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన చేతికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ముద్ఖేడ్ లోని మాతా సాహిబ్ గురుద్వారాలో ఒక నిహంగ్ సిక్కు అనే వ్యక్తి ‘కిర్పాన్’తో బాదల్‌పై దాడి చేశాడు. ఈ దాడిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి స్వయంగా సుఖ్బీర్ సింగ్ బాదల్‌తో ఫోన్లో మాట్లాడారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని బాదల్ ఫడ్నవీస్‌కు తెలిపినట్లు సమాచారం.
- Advertisement -



