నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో అయోధ్య రామ్ మందిర్ విరాళా చోరీని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఆవరణలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ అక్షయ్ కుమార్ హుండీ పెట్టి వినూత్న నిరసన తెలిపారు. ఆ హుండీలో ఎంపీలందరూ విరాళాలు అందజేశారు. అయోధ్య విరాళాలపై సమగ్ర విచారణ జరగాలని, ఉభయసభల్లో విరాళాల చోరీలపై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అ విధంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా పర్యటించారు. తాజాగా ఆ విధంగా సేకరించిన మొత్తం రూ.2,15,490 నగదుతో పాటు రెండు వెండి నాణాలను ఢిల్లీలోని ప్రాచీన హనుమాన్ టెంపుల్ కు విరాళంగా అందజేశారు.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ సభ్యులు ఈ మొత్తాన్ని విరాళంగా అందించారని ఎస్పీ ఎంపీలు తెలిపారు. అయోధ్య విరాళాల దొంగతనం అసలు స్వరూపం ఏమిటో తాము తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్రస్తుత దర్యాప్తుపై అనుమానాలున్నాయని, ఒక సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో సిట్ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఆలయం నిర్మిస్తున్నప్పుడు ప్రజలు భక్తులు విరాళాలు అందజేస్తూ ఉంటారు. కానీ విరాళాలు చోరీ చేసిన వ్యక్తులకు కఠిన శిక్షపడాలని ఎంపీ అక్షయ్ యాదవ్ అన్నారు.



