Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్వాతంత్ర్య వేడుకల్లో అస్వస్థతకు గురైన మంత్రి

స్వాతంత్ర్య వేడుకల్లో అస్వస్థతకు గురైన మంత్రి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తిరుపతి జిల్లా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో కలకలం. జెండా పండుగకు హాజరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. వేదికపై తన ప్రసంగం చదువుతున్నారు. ఈ సమయంలోనే.. ఆయన ఉన్నట్లు ఉండి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చదువుతూ చదువుతూ.. ఒక్కసారిగా ఆయన తూలిపోయారు. వెనక్కి పడబోతుండగా.. ఆ పక్కనే ఉన్న సెక్యూరిటీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. సకాలంలో స్పందించిన వైద్యులు మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాసేపటి తర్వాత మంత్రి ఆనం స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -