- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని, దీనికి ఈనెల 16వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. పలు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు వినియోగదారులకు మెసేజ్లు, ఫోన్ల ద్వారా ఈకేవైసీ చేయించుకోకపోతే గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని, సబ్సిడీ రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం, ఆదివారం సెలవులు కావడంతో వినియోగదారులు సందేహంలో ఉన్నారు. ఏజెన్సీల నిర్వాహకులు శని, ఆదివారాలు కూడా పని దినాలుగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. గడువు పొడిగింపుపై పైనుంచి ఆదేశాలు వస్తే సెలవులు ఉంటాయని చెప్పారు.
- Advertisement -



