Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలురష్యాలో ఎత్తైన పర్వతంపై జాతీయజెండా ఎగురవేసిన ఏపీ పోలీస్‌

రష్యాలో ఎత్తైన పర్వతంపై జాతీయజెండా ఎగురవేసిన ఏపీ పోలీస్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు రష్యాలోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి, 100 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఏలూరు రూరల్ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ సబ్-ఇన్‌స్పెక్టర్ వి.వెంకటేశ్వరరావు, రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని  అధిరోహించారు. శనివారం ఉదయం పతకాన్ని ఎగురవేసి జాతీయగీతం ఆలపించారు. తన విజయాన్ని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి అంకితం చేశారు వెంకటేశ్వరరావు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -