Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ తహసీల్దార్‌గా రమేష్... 

ఉత్తమ తహసీల్దార్‌గా రమేష్… 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియను 100 శాతం పూర్తి చేసి  జిల్లాలో మొదటి మండలంగా ఆలూర్ గుర్తింపు పొందిన సందర్భంగా, 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలూర్ మండల తహసీల్దార్ రమేష్‌ను ఉత్తమ తహసీల్దార్‌గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ సబ్‌ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా చేతుల మీదుగా తహసీల్దార్ రమేష్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ సిబ్బందితో సమన్వయం చేసుకుని మండలంలో 100 శాతం పూర్తి చేయడంలో రమేష్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్‌కు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -