- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అరుణాచల్‌ప్రదేశ్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతోపాటు, పలు చోట్ల వరదలు సంభవించాయి. ఈ ఘటనల్లో నలుగురు మరణించగా, ఐదుగురు సైనికులు గల్లంతయ్యారు. అప్పర్సుబన్సిరి జిల్లాలోని కియోజరింగ్-బయాచింగ్ రోడ్డు మలుపు ప్రాంతం, దిబంగ్ లోయ జిల్లాలో ఈ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. దిబంగ్ లోయలో పసుపానీ ఆర్మీ క్యాంపులోని రెండు షెల్టర్లు కొట్టుకుపోయాయి. ఏడుగురు జవాన్లలో ఇద్దరిని రక్షించగా, ఐదుగురి కోసం గాలిస్తున్నారు.
- Advertisement -



