Monday, August 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రేక్షకుల్ని థ్రిల్ చేసే 'అ'

ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే ‘అ’

- Advertisement -

స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారిగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్ , ఎడిటర్-డైరెక్టర్ గ్యారీ బీహెచ్ నిర్మిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి ‘అ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను హీరో అడివి శేష్ ఆవిష్కరించారు. టైటిల్‌ను ఇంట్రెస్టింగ్‌గా ప్రజెంట్ చేయడంతో విడుదలైన వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది. టైటిల్ చుట్టూ ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ అనే పదాలను పొందుపరిచారు. అమ్మాయిలు అదృశ్యం కావడం, ఆ తర్వాత జరిగే దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుందని ఈ పదాలు సూచిస్తున్నాయి. ఇక ‘అనుమానం, అసాంఘికం, అమానుషం’ వంటి పదాలు కథలో కనిపించేదానికంటే మరింత ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయనే క్యూరియాసిటీని పెంచుతున్నాయి. అలాగే ఈ థ్రిల్లర్ కథ హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుందని అర్థమవుతోంది. అర్చన అయ్యర్ రాహుల్ విజయ్ సరసన కథానాయికగా నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. అభినవ్ వి. కునపరెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. జాన్ విజయ్, సుధర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -