ఎం బి ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద రాజేష్ నాయుడు దర్శకత్వలో బిచ్చు నాయక్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 ‘2కె లవర్స్’ (సోల్ ఆఫ్ లవ్) పూజా కార్యక్రమాలు ఆదివారం దైవ సన్నిధానం లో ఘనంగా జరిగాయి. ఈ సినిమాలో మోహిత్ పెడాడ, శృతి శంకర్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, ప్రణీత్ రెడ్డి, సప్తగిరి, రచ్చ రవి, మొట్టా రాజేంద్రన్, రమ్య పొందూరి, సూర్య, శివన్నారాయణ, ఆమని తదితరులు ముఖ్య పాత్రలను పోషించబోతున్నారు. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి వీఎన్ ఆదిత్య క్లాప్ కొట్టగా, మణిశర్మ గౌరవ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ,‘రసూల్ అద్భుతమైన కథ ఇచ్చారు. తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథతో పాటు, ఎమోషన్స్‌తో సినిమాని రూపొందిస్తున్నాం. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది’ అని అన్నారు. నిర్మాత బిచ్చు నాయక్ మాట్లాడుతూ, ‘తెలంగాణ యాసలో ఇది వరకు చూడని ప్రేమ కథ ఇది. థియేటర్ నుంచి ఇంటికి వెళ్లినా కూడా వెంటాడేలా మా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. రచయిత రసూల్ మాట్లాడుతూ, ‘మా చిత్రంలో ప్రేమ, రోదన, ఆవేదన, బంధాలు, అనుబంధాలు, హాస్యం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి’ అని అన్నారు. హీరో మోహిత్ మాట్లాడుతూ,’ ‘ఇదొక కొత్త ప్రేమ కథ. రెగ్యులర్ సినిమాల్లా మాత్రం ఉండదు’ అని తెలిపారు. హీరోయిన్ శృతి శంకర్ మాట్లాడుతూ,’ మా సినిమాలో ఎమోషన్‌తో పాటుగా కామెడీ కూడా కావాల్సినంత ఉంటుంది’ అని అన్నారు. మోహిత్ పెడాడ, శృతి శంకర్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, ప్రణీత్ రెడ్డి, సప్తగిరి, రచ్చ రవి, మొట్టా రాజేంద్రన్, రమ్య పొందూరి, సూర్య, శివన్నారాయణ, ఆమని తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకి దర్శకుడు: రాజేష్ నాయుడు,నిర్మాత: బిచ్చు నాయక్,సంగీతం: మణిశర్మ,
రచయిత: రసూల్ భాయ్, డిఓపి: పవన్.
ఘనంగా ‘2కె లవర్స్’ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



