Monday, August 17, 2026
E-PAPER
Homeఆటలుబంగ్లాదేశ్‌ అద్భుతం

బంగ్లాదేశ్‌ అద్భుతం

- Advertisement -

తొలి టెస్టులో ఆస్ర్టేలియాపై 9 వికెట్లతో గెలుపు
డార్విన్‌ (ఆస్ర్టేలియా) : టెస్టు క్రికెట్‌లో పసికూన బంగ్లాదేశ్‌ అద్భుతం చేసింది. అగ్రజట్టు ఆస్ర్టేలియాను సొంతగడ్డపై టెస్టు మ్యాచ్‌లో ఓడించి ప్రపంచ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. యువ పేసర్‌ హసన్‌ మహమూద్‌ (6/55) సిక్సర్‌తో తొలి ఇన్నింగ్స్‌లో కంగారూలను 198 పరుగులకే కుప్పకూల్చిన బంగ్లాదేశ్‌.. టాంజిద్‌ హసన్‌ (101), నజ్ముల్‌ శాంటో (84), మెహిది హసన్‌ మిరాజ్‌ (65) మెరుపులతో తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగుల భారీ స్కోరు చేసింది. కామెరూన్‌ గ్రీన్‌ (104) సెంచరీతో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 284 పరుగులు చేసినా… తొలి లోటు అధిగమించేందుకే అది దాదాపుగా సరిపోయింది. 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ 14.2 ఓవర్లలో ఓ వికెట్‌ కోల్పోయి ఛేదించింది. ఇస్లామ్‌ (25 నాటౌట్‌), మోమినుల్‌ హాక్‌ (30 నాటౌట్‌) రాణించారు. ఆస్ర్టేలియా గడ్డపై మూడోసారి ఓ టెస్టులో ఆడిన బంగ్లాదేశ్‌.. అద్భుతం విజయం ఖాతాలో వేసుకుంది. ఆస్ర్టేలియాకు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ హసన్‌ మహమూద్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -