మధ్యప్రాచ్యానికి బయలుదేరిన యుద్ధ విమాన వాహక నౌక
వాషింగ్టన్ : ఇరాన్ యుద్ధం కారణంగా సుదీర్ఘ కాలం పాటు సముద్ర జలాలలోనే గడిపిన యుద్ధ విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ స్థానంలో మరో నౌకను అమెరికా మోహరిస్తోంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌లో ఉన్న ఐదు వేల మంది సిబ్బంది అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులను మీడియా బయటపెట్టడంతో మరో యుద్ధ విమాన వాహక నౌక యూఎస్ఎస్ జార్జ్
వాషింగ్టన్‌ను మధ్యప్రాచ్యానికి పంపుతోంది. ఈ నౌక వియత్నాంలోని దనాంగ్ ఓడరేవు నుంచి పశ్చిమ పసిఫిక్ మహా సముద్రానికి బయలుదేరింది. యూఎస్ఎస్ లింకన్ 266 రోజులకు పైగా నేల అనేదే చూడకుండా సముద్ర జలాలలోనే గడిపింది. నౌకలో సరఫరాలకు తీవ్ర కొరత ఏర్పడుతోందని, సిబ్బంది మానసికంగా కుంగిపోతున్నారని, ఆత్మహత్యకు కూడా ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యానికి వేరే నౌకను పంపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నౌకాదళ తాత్కాలిక కార్యదర్శి హంగ్ కావో సూచనప్రాయంగా చెప్పారు. అయితే యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ తరలింపును పెంటగాన్ ఇంకా ధృవీకరించలేదు.
యూఎస్ఎస్ లింకన్ స్థానంలో యూఎస్ఎస్ వాషింగ్టన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



