Monday, August 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమా రక్షణ ఒప్పందంలో ఈజిప్ట్‌ కూడా చేరుతుంది : టర్కీ

మా రక్షణ ఒప్పందంలో ఈజిప్ట్‌ కూడా చేరుతుంది : టర్కీ

- Advertisement -

అంకారా : సౌదీ అరేబియా, పాకిస్తాన్‌తో కలిసి తాము కుదుర్చుకున్న ఉమ్మడి రక్షణ ఒప్పందంలో ఈజిప్ట్‌ కూడా చేరుతుందని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ చెప్పారు. ఈ ఒప్పందంలో మరింత మంది సభ్యులు చేరవచ్చునని ఆయన తెలిపారు. సభ్య దేశాలలో ఎవరి పైన దాడి జరిగినా సంయుక్తంగా చర్యలు చేపట్టేందుకు మక్కా జాయింట్‌ డిఫెన్స్‌ అగ్రిమెంటుపై సంతకాలు చేసిన దేశాలు కట్టుబడి ఉంటాయని వివరించారు. ఈ ఒప్పందం ప్రపంచానికి ఓ ముఖ్యమైన సందేశాన్ని అందించిందని అన్నారు. పవిత్ర మక్కా నగరంలో ఈజిప్ట్‌ అధ్యక్షుడు ఎర్డోగన్‌, సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ గత శుక్రవారం సంతకాలు చేసిన విషయం తెలిసిందే. సభ్య దేశాలలో ఏ ఒక్కరిపై దాడి జరిగినా అందరి పైనా జరిగినట్లుగానే భావించాలని మక్కా ఒప్పందం నిర్దేశిస్తోంది.
అల్‌ జజీరా వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎర్డోగన్‌ అనేక ప్రాంతీయ అంశాలను ప్రస్తావించారు. హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడానికి ఈజిప్ట్‌ ప్రాధాన్యత ఇస్తుందని అంటూ దానిని నిరంతరం మూసివేస్తే ఎవరికీ ప్రయోజనం కలగదని చెప్పారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ నివారణకు ఖతార్‌ నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వ పాత్రను కొనియాడారు. పొరుగు దేశాలైన సిరియా, గాజా, లెబనాన్‌లో చెలరేగుతున్న అలజడి విషయంలో ప్రేక్షక పాత్ర పోషించబోమని ఎర్డోగన్‌ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -