Monday, August 17, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు రాసిన లేఖలో పార్టీతో తనకున్న అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన నిర్ణయానికి “అత్యవసర ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితులు” కారణమని పూనావాలా పేర్కొన్నారు. తన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్ రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జూలై 30న కూడా పూనావాలా రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ, బిజెపి నాయకత్వం దానిని అంగీకరించలేదు. తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని నాయకత్వం కోరింది. అయితే, సుదీర్ఘంగా, తీవ్రంగా ఆలోచించిన అనంతరం పార్టీ నుంచి వైదొలగాలనే తుది నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తాజా లేఖలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -