Tuesday, August 18, 2026
E-PAPER
Homeజాతీయంకేబీఆర్ చుట్టూ వన్ వే..

కేబీఆర్ చుట్టూ వన్ వే..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లో హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేసేందుకు..అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో వన్ వే ట్రాఫిక్ ను పరిశీలించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఈ వన్-వే విధానం వల్ల పనులు వేగంగా జరుగుతాయని, ప్రారంభంలో ఒకటి రెండు చోట్ల చిన్నపాటి ఇబ్బందులు తలెత్తినా… వాటిని వెంటనే క్లియర్ చేస్తామని స్పష్టం చేశారు.వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు నాలుగు షిఫ్ట్ లలో పనిచేస్తున్నారని చెప్పారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ జోన్ల అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.బస్ స్టాప్‌ల మార్పునకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ ఎండీతో చర్చలు జరిపామన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇస్తున్న సూచనలను విధిగా పాటిస్తూ, వాహనదారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -