Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం

పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం

- Advertisement -

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. వీరస్వామి
నవతెలంగాణ-నెల్లికుదురు

పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థుల ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె వీరస్వామి అన్నారు. మంగళవారం నెల్లికుదురులోని ఎన్ఎస్ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో ఆయన పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, తమ ఇళ్లలో, సమాజంలో కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ వంటి విలువలు పెంపొందుతాయని పేర్కొన్నారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు మర్సకట్ల అనిల్ కుమార్, పెద్దూరి వెంకటేశ్వర్లులు మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పై వాలంటీర్లు పెంపొందించుకొని ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేవేందర్, శివమణి, నరేందర్, అక్షయ్, రాజు, సిద్ధు, బీంసాగర్, ఈశ్వర్, శివ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -