Wednesday, August 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం

నేడు పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ నేడు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://www.tgprb.in/ వెబ్‌సైట్‌లో తమకు నచ్చిన పోస్టులను ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష కోసం సెప్టెంబర్ 9లోగా పార్ట్-1 దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకాన్ని కలిపి ఒకే JPG ఫైల్/ఇమేజ్‌గా అప్‌లోడ్ చేయాలి. ఫేస్ అథెంటికేషన్ కోసం ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత పార్ట్-2 దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -