- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జెఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గురువారం జార్ఖండ్ హైకోర్టు స్టే విధించింది. 15 రోజుల్లోగా కౌంటర్ అఫిడవిట్‌తో పాటు తమ స్పందన తెలియజేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విద్యార్థులు చేపట్టిన 24 రోజుల నిరసనల తర్వాత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం జెఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Advertisement -



