నవతెలంగాణ-హైదాబాద్: నీట్ పేపర్ లీక్ లను వ్యతిరేకిస్తూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ తో పాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళన సమయంలో యువతపై పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది మితిమీరిన బలప్రయోగం చేశారన్న విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయా ఘటనలపై సుప్రీంకోర్టు గురువారం ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని (హెచ్‌పిఇసి) ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్‌లు జయమల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం, ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్.ఆర్. బిష్ణోయ్ కూడా సభ్యులుగా ఉంటారని తెలిపింది.


