నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీవ్రమైన నేరారోపణలు రుజువై జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (MP Sanjjan Kumar) తుది శ్వాస విడిచారు. తిహార్ జైలులో ఖైదీగా ఉన్న ఆయనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అధికారులు వెంటనే న్యూఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. 2018 డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. నాటి నుంచి ఆయన తిహార్ జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారు.
మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ఇకలేరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



