Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు: మహేశ్‌కుమార్‌గౌడ్‌

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు: మహేశ్‌కుమార్‌గౌడ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. గురువారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కొండా సుస్మిత, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. మంత్రి కొండా సురేఖకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదనను అర్థం చేసుకున్నామని, టికెట్లపై నిర్ణయం ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ తీసుకుంటాయని చెప్పారు. ఎవరికి వారు పోటీ చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. 22ఏ అంశంపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. కిందిస్థాయిలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారని మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -