Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకుక్కల భయంతో 10 పాఠశాలలకు సెలవులు

కుక్కల భయంతో 10 పాఠశాలలకు సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో వీధికుక్కల సంచారం పెరగడంతో పది పాఠశాలలను ఈ నెల 23వ తేదీ వరకు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. నారాయణ్‌బగడ్, నల్‌గావ్‌ ప్రాంతాల్లోని పది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పరిసరాల్లో వీధికుక్కల బెడద పెరిగినట్లు స్థానిక అధికారులు నివేదిక సమర్పించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు చమోలీ ప్రధాన విద్యాధికారి ఆకాశ్‌ సారస్వత్‌ తెలిపారు. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వీధికుక్కల బెడదను నియంత్రించిన అనంతరం పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -