– జెడ్పీహెచ్‌ఎస్ లో ‘నేషనల్ స్పేస్ డే’ విజ్ఞాన ప్రదర్శన పోటీలు
నవతెలంగాణ – సత్తుపల్లి : సత్తుపల్లి మండలం గంగారంలోని శ్రీ దాసరి వీరారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘నేషనల్ స్పేస్ డే’ (ఆగస్టు 23) ను పురస్కరించుకుని బుధవారం విద్యార్థులకు ప్రాజెక్ట్ మోడల్స్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. 6 నుండి 10వ తరగతి విద్యార్థులు అంతరిక్ష రంగానికి సంబంధించిన పలు ఆకర్షణీయమైన నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు. అంతరిక్ష రంగంలో భారత ప్రయాణం, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ సేవలు, ఇస్రో మైలురాళ్లైన గగన్‌యాన్, నావిక్, మ్యాన్ ఆన్ మార్స్, చంద్రయాన్ మిషన్లపై విద్యార్థులు వేసిన చిత్రాలు, నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభను, విజ్ఞానదాయక మోడళ్లను హెచ్ఎం. జయరాజుతో పాటు ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు తిలకించి అభినందించారు. అనంతరం వినూత్న ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల తరఫున బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం., ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విజ్ఞాన నింగిలో గంగారం విద్యార్థుల ‘ప్రజ్ఞ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



