నవతెలంగాణ – సత్తుపల్లి : 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక హరివిల్లు కలర్ ల్యాబ్‌లో ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండల అధ్యక్షుడు పాషా ఆధ్వర్యంలో, గౌరవ జిల్లా సెక్రెటరీ కనకారావు సహకారంతో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హరివిల్లు ల్యాబ్ అధినేత దాసరి సత్యనారాయణ బ్రదర్స్, సుమాంజలి స్టూడియో రాము ఈ వేడుకలకు సంధాన కర్తలుగా వ్యవహరించారు. ప్రత్యేక ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాంబాబు, కోశాధికారి మూర్తితో పాటు కల్కి వెంకటేశ్వరరావు, జ్యోతి స్టూడియో కోటేశ్వరరావు, హరీష్, సతీష్ రెడ్డి, అమీర్ భాషా, విజయ్, మారేష్, రంజిత్, వేణు, నరసింహారావు, మధు, అబ్దుల్లా పాల్గొన్నారు.
సత్తుపల్లిలో ప్రపంచ ‘ఫోటోగ్రఫీ’ దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



