- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రైతు ఉద్యమ నేత, సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి(89) కన్నుమూశారు.
కొద్దిసేపటి క్రితం సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయమైన ఎంబీ భవన్కు తీసుకొచ్చారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం ఎంబీ భవన్ నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వరకు సారంపల్లి మల్లారెడ్డి అంతిమయాత్ర కొనసాగుతుంది. అనంతరం వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం మల్లారెడ్డి భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగిచనున్నారు.
- Advertisement -



