- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు భోజన విరామ సమయానికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. పసిందు(65) అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ధనంజయ(4) ఉన్నాడు. తొలి సెషన్లో లంక జట్టు కమిల్(19), కమిందు(32) వికెట్లు కోల్పోయింది. వీరిద్దరూ ప్రసిద్ధ్ బౌలింగ్‌లోనే ఔటయ్యారు. ఆతిథ్య జట్టు ఇంకా 373 పరుగులు వెనుకంజలో ఉంది. ఆటగాళ్లు డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లగానే మైదానాన్ని స్టేడియం సిబ్బంది కవర్లతో కప్పేశారు. వర్షం పడకపోయినా.. ముందస్తు చర్యల్లో భాగంగా కవర్లు కప్పినట్లు తెలుస్తోంది.
- Advertisement -



