- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’. ఈ మూవీ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు ‘టాక్సిక్’ చిత్ర బృందానికి అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అవకాశమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు పది రోజుల పాటు అమల్లో ఉంటాయని తెలిపింది.
- Advertisement -



