తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు సురవరం ప్రతాప రెడ్డి జీవితంపై తీసిన చలన చిత్రం అందరికి స్ఫూర్తిదాయకం అని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి సాహితి వైజయంతి ట్రస్ట్ నిర్మించిన ‘సురవరం’ బయోపిక్ ప్రివ్యూను ప్రసాద్ లాబ్స్ లో మంగళవారం ప్రదర్శించారు. వి. శ్రీనివాస్ గౌడ్ తోపాటు సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, తెలంగాణ సారస్వత పరిషద్ అధ్యక్షులు, ట్రస్ట్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివా రెడ్డి, ఉపాధ్యక్షులు కొండా లక్ష్మి కాంత రెడ్డి, సన్ షైన్ హాస్పిటల్స్ డైరెక్టర్ డా. గురువారెడ్డి తదితరులు హాజరయ్యారు. బయోపిక్ వీక్షించిన అనంతరం వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,‘సురవరం ప్రతాప్ రెడ్డి సేవలను గౌరవిస్తూ ప్రభుత్వలు పలు కార్యక్రమాలు చేపట్టి నప్పటికీ, ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమాని తెరకెక్కించడం అభినంద నీయం. నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజల దైన్యం, దారిద్ర్యం, ప్రాథమిక హక్కులను కూడా నోచుకోని దుస్థితి చూసి చలించి పోయి ప్రజలను చైతన్య పరుస్తున్న ఈ సినిమాలోని దృశ్యాలు ఆలోపింపజేసేవిగా ఉన్నాయి.
ప్రతిఒక్కరు ఈ చిత్రాన్ని చూసి చరిత్ర తెలుసుకోవాలి’ అని తెలిపారు. ‘హైదరాబాద్ రాజ్యం అంత ఉర్దూమయం, మాతృభాష తెలుగులో చదువుకునే అవకాశాలు లేని ఆ రోజుల్లో సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణాను జాగృతం చేయడం వంటి దృశ్యాలు ఈ సినిమాలో నాటి పరిస్థితులను ప్రతిబింబిం చాయి. నిజాం నాటి చరిత్ర నేటి తరం తెలుసుకునేందుకు “సురవరం” చిత్రాన్ని చూడవలసిందే’ అని శేఖర్ కమ్ముల చెప్పారు. ఈ కార్యక్రమంలో “సురవరం” దర్శకులు బి.ఏం.రెడ్డి, జి. హర్షవర్ధన్ రాయల్, రచయిత బి. విజయ ప్రసాద్, సురవరం కుటుంబ సభ్యులు డా. సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి, సురవరం అనిల్ కుమార్ రెడ్డి, సురవరం కపిల్, సురవరం గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెండితెరపై సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



