Wednesday, August 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్

- Advertisement -

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘చిరంజీవి’. ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 28న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మంగళ వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యష్ మిట్టల్ మాట్లాడుతూ,‘మా సినిమా సరికొత్త కంటెంట్తో మీ ముందుకు రాబోతోంది. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా’ అని తెలిపారు. ‘ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక్క నిమిషం కూడా మీరు చూపు తిప్పుకోకుండా ఎంగేజ్ చేసేలా ఉంటుంది. కికు, దీప్తి, డైరెక్టర్ శుభ మొదటి నుంచి సినిమాను నమ్మారు. వాళ్ల నమ్మకం థియేటర్స్ లో నిజం కావాలి’ అని ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ చెప్పారు. డైరెక్టర్ శుభ సాయి వెంకట్ మాట్లాడుతూ,‘మా సినిమాకు వచ్చిన ఇబ్బందులు సాల్వ్ అయ్యేలా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరుపున మా ప్రసన్న సహకారం అందించారు. ఆయనకు థ్యాంక్స్. ఈ కథలో ఒక డేరింగ్ రిస్కీ ఎలిమెంట్ ఉంది. అలాంటి రిస్కీ పాయింట్ ను నమ్మి మా ప్రొడ్యూసర్స్ సినిమా చేశారు. కథను నమ్మి నిలబడ్డారు. వారి కోసం మా మూవీ హిట్ కావాలి’ అని అన్నారు. ప్రొడ్యూసర్ దీప్తి నడిమింటి మాట్లాడుతూ,‘ఒక మంచి సినిమా చేశామనే నమ్మకంతో మేమంతా ఉన్నాం. సినిమా కంటెంట్ మీద నమ్మకంతో ఈ నెల 28న ధైర్యంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. మీరు థియేటర్స్ కు రండి ఎక్కడా డిజప్పాయింట్ అవరు. ప్రొడ్యూసర్స్ గా నా గ్యారెంటీ ఇది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -