Wednesday, August 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహసిత్‌ గోలి దర్శకత్వంలో రవితేజ

హసిత్‌ గోలి దర్శకత్వంలో రవితేజ

- Advertisement -

తాజాగా ‘ఇరుముడి’ వంటి సంచలన విజయాన్ని అందుకున్న హీరో రవితేజ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. దర్శకుడు హసిత్ గోలితో కలిసి రవితేజ ఓ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ, హసిత్ గోలి, ఎస్వీసీ కాంబినేషన్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్లను రవితేజ మరో స్థాయికి తీసుకెళ్తే.. వైవిధ్యమైన కథలు, హ్యూమర్ తో హసిత్ గోలి తనకంటూ గుర్తింపు తెచ్చు కున్నారు. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న సినిమా అంచనాలు పెంచింది. తాజాగా సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. దీంతో వచ్చే సంక్రాంతికి రవితేజ నుంచి ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను అలరించనుంది.హసిత్ గోలి రూపొందించనున్న ఈ కామెడీ డ్రివెన్ కాన్సెప్ట్‌లో రవితేజ సరికొత్తగా కనిపించబోతున్నారు. హ్యూమర్, ఎనర్జీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం పుల్ లెంత్ ఎంటర్‌టైనింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సినిమా టైటిల్‌ను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -