- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా కురవిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కురవి గ్రామానికి చెందిన మోటపోతుల రమేశ్ (36) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు బుధవారం ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో రమేశ్ సోదరి ధనలక్ష్మి తన తమ్ముడి మృతదేహం వద్దకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘రాఖీ కట్టక ముందే పాడెనెక్కావా తమ్ముడూ’ అంటూ రోదిస్తూ పాడెపై ఉన్న రమేశ్ చేతికి రాఖీ కట్టారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.
- Advertisement -



