- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోడీ సెప్టెంబర్ 1న ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ పర్యటనల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కేంద్ర క్యాబినెట్‌లో 12 మందిని తొలగించి యువతకు అవకాశం కల్పించనున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకాలు, బదిలీలు కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
- Advertisement -



