Thursday, August 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆటోను ఢీకొట్టిన ప్రయివేటు బస్సు.. ఏడుగురి మృతి

ఆటోను ఢీకొట్టిన ప్రయివేటు బస్సు.. ఏడుగురి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఏడుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. బాధితులంతా వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలిలోనే నలుగురు మృతి చెందగా.. ఇద్దరు గుంటూరు జీజీహెచ్‌లో, ఒకరు చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను బొంతా బాబు (62), బొంతా మణెమ్మ (55), సంపూర్ణమ్మ (70), లక్ష్మమ్మ (75), గంగమ్మ (50), చౌటుపల్లి సువార్త (45), మరియమ్మ(45) గా గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -