Thursday, August 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు హెల్ప్‌లైన్

నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు హెల్ప్‌లైన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నేపాల్‌లో వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర విదేశాంగ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో అధికారులు సమన్వయం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సంప్రదింపులు లేకపోతే హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. సహాయం కోసం పేరు, పాస్‌పోర్ట్, మొబైల్, చివరిగా తెలిసిన ప్రాంతం, టూర్ ఆపరేటర్ వివరాలు ఇవ్వాలి. 9871999044, 9949351270, 9618597969 నెంబర్లకు కాల్ చేసి సహాయం తీసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -