నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 14న డోంగ్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానన్ దేశాయ్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆదేశానుసారం మండలంలోని కాంగ్రెస్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఉదయం 8:00 గంటలకు ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు, కార్యకర్తలు మీడియా మిత్రులు సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



