Monday, August 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమీ ప్రేమకథని గుర్తు చేస్తుంది

మీ ప్రేమకథని గుర్తు చేస్తుంది

- Advertisement -

వర్ధన్, కృష్ణప్రియ జంటగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టీ.ఆర్‌.ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో వర్ధన్ మాట్లాడుతూ,‘కాగితం పడవలు.. ఒక కాలువలో ప్రయాణం చేయాలని అనుకున్నాం. తెలియకుండానే ఒక సముద్రంలోకి వచ్చేశాం. ఎన్నోసార్లు ఒడ్డుకు వద్దాం అను కున్నాం. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. డైరెక్టర్ తుకారాం చాలా అద్భుతంగా తీశారు’ అని తెలిపారు. ‘మా సినిమాకి మా నిర్మాతలే హీరోలు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే మీ ప్రేమకథ మీకు గుర్తుకొస్తుంది. మీరందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని దర్శకుడు తుకారాం చెప్పారు.

హీరోయిన్ కృష్ణప్రియ మాట్లాడుతూ,‘తెలుగులో ‘కాగితం పడవలు’ నా రెండో సినిమా. మా నిర్మాతలందరికీ థాంక్యూ. మా డైరెక్టర్ చాలా ప్యాషన్‌తో సినిమా తీశారు. ఇందులో చాలా మంచి క్యారెక్టర్‌లో నటించాను’ అని తెలిపారు. నిర్మాత అంజనప్ప మాట్లాడుతూ,‘ఈ సినిమా కోసం టీమ్ చాలా కష్టపడింది. తుకారాం చాలా అద్భుతంగా సినిమా తీశారు. అలాగే మా డీఓపీ కష్టాన్ని కూడా మర్చిపోలేము. సెప్టెంబర్ 18న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరంతా సపోర్ట్ చేయాలి’ అని అన్నారు. ‘ఈ సినిమా ఒక ఎమోషన్. కంటెంట్ ఉన్న సినిమా. కంటెంట్‌ ఉంటే ప్రేక్ష‍కులు తప్పకుండా ఆదరించి, పెద్ద హిట్‌ చేస్తున్నారు. మీ ప్రేమకథని గుర్తు చేసే ఈ సినిమా కచ్చితంగా ప్రేక్ష‍కాదరణ పొందుతుందనే నమ్మకంతో ఉన్నాం’ అని డీవోపీ రుద్ర సాయి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -