బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న అత్యంత ఆసక్తికర భక్తి ప్రధాన చిత్రం ‘కనకదుర్గ’. ఈ చిత్రం జీ5 తెలుగు భారీ పోస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ లైనప్‌లో చోటు దక్కించుకుంది.దైవత్వం తాలూకా అద్భుతమైన శక్తిని ప్రతిబింబించే ఓ పవర్‌ఫుల్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆసక్తి కరమైన క్రియేటివ్ కలయికగా నిలుస్తోంది. అల్లరి నరేష్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తుండగా, బీవీఎస్ రవి కథ అందిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం ఇలా అన్ని అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ చిత్రం సర్వ శక్తిమంతమైన కనకదుర్గ అమ్మవారి దివ్యశక్తి, ఆధ్యా త్మిక ప్రాముఖ్యత నుంచి స్ఫూర్తి పొందింది. భక్తి భావాన్ని ఆవిష్కరిస్తూనే, నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఓ పవర్‌ఫుల్ సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ముందుగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసి, ఆ తర్వాత ప్రత్యేకంగా జీ5 తెలుగులో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది అని మేకర్స్ తెలిపారు.
శక్తివంతమైన కథతో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



