హీరో రవితేజ సోదరుడి తన యుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ సోమవారం మారెమ్మ ఫస్ట్ సింగిల్ ‘బావ బావ’ సాంగ్‌ని రిలీజ్ చేశారు.
ప్రశాంత్ ఆర్ విహారి స్వరపరిచిన ఈ పాటలో పల్లెటూరి మట్టి వాసనతో పాటు మోడరన్ మ్యూజిక్ లేయర్స్ మిళితమై ఎంతో మధురమైన అనుభూతిని కలిగిస్తోంది. ప్లజెంట్ ఫీల్‌ను అందించేలా ఈ పాట సాగే తీరు ఆకట్టుకుంటుంది.
కమల్ ఎస్లవత్ లిరిక్స్ బావపై ఉన్న ఆప్యాయతను ఎంతో సింపుల్‌గా, హదయానికి దగ్గరగా వ్యక్త పరు స్తాయి. శతి రంజని తన స్వరంలో ఉన్న నేచు రల్, రస్టిక్ టచ్‌తో పాటకు మరింత ప్రాణం పోసింది.
మాధవ్, దీపా బాలు మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వారి యాక్టింగ్‌లో ఉన్న సహజత్వం, పల్లెటూరి అందమైన లోకేషన్స్ కలిసి విజువల్స్ ట్రీట్‌గా మార్చాయి. ఈ సినిమా విడుదల తేదీ త్వరలో అనౌన్స్ చేయనున్నారు.
మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలా సాగరం, డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి, ఎడిటర్: దేవ్ రాథోడ్, ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్ మురుగేషన్, యాక్షన్ డైరెక్టర్: మాడిగొండ నటరాజ్.
నయా విలేజ్ యాక్షన్ డ్రామా
- Advertisement -
- Advertisement -



