చెన్నై, గుజరాత్ మ్యాచ్‌ల వేదికల మార్పు
ముంబయి : ఐపీఎల్19లో చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌ల వేదికలు స్వాప్ అయ్యాయి. ఏప్రిల్ 26న అహ్మదాబాద్ సహా గుజరాత్‌లో పలు మున్సిపాలిటీలకు ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న మధ్యాహ్నం 3.30 గంటలకు టైటాన్స్, సూపర్‌కింగ్స్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగాల్సి ఉండగా.. మే 21న ఈ రెండు జట్ల మ్యాచ్ చెపాక్‌లో జరగాల్సి ఉంది. కానీ మార్పు చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న జరగాల్సిన మ్యాచ్ చెన్నైకి మారగా… మే 21న జరగాల్సిన మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు కేటాయించారు. మ్యాచ్ వేళల్లో ఎటువంటి మార్పు ఉండబోదు. ఈ సీజన్‌లో సూపర్‌కింగ్స్ 4 మ్యాచ్‌ల్లో ఓ విజయం సాధించగా, టైటాన్స్ 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించింది.
ఆ మ్యాచ్ ఇక్కడ.. ఈ మ్యాచ్ అక్కడ!
- Advertisement -
- Advertisement -



