పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు, వారికి ఎప్‌సెట్ (ఎంసెట్), నీట్ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ సిద్ధమైంది. ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ, కార్యదర్శి కె.ఆశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పర్యవేక్షణలో ఈ నెల 20 నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ ఎప్‌సెట్ (ఎంసెట్), నీట్ పరీక్షలను నిర్వహించనున్నుట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యాలయంలో నాయకులు ఆవిష్కరిం చారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లా డుతూ.. 18 ఏండ్లుగా ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరాయంగా ఈ పరీక్షలను నిర్వహిస్తోందని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలు లక్షల రూపాయలు వసూలు చేస్తూ సామాన్య, పేద విద్యార్థులను ఆ పరీక్షలకు దూరం చేస్తున్నాయని, అటువంటి పేద విద్యార్థులకు నాణ్యమై న పరీక్షా విధానాన్ని పరిచయం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 300 కేంద్రాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగు తా యని,అత్యంత అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలను రూపొందించినట్టు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఈ మోడల్ పరీక్షలు ఎంతో మేలు చేస్తాయని, సబ్జెక్టుపై పట్టుసాధించేం దుకు, మెళకువలు నేర్చుకునేందుకు దోహదపడతాయని చెప్పారు. ఈ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన టాప్-10 మంది విద్యార్థులకు బంగారు పతకాలను బహుకరిం చనున్నట్టు ప్రకటిం చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 9030881429, 9515166907 నెంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, మమత, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్, ఉపాధ్యక్షులు రజనీకాంత్, నాగేందర్, ప్రవీణ్, ఆంజనేయులు, కార్తీక్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మోడల్ ఎప్‌సెట్, నీట్ పరీక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



