తనకు ప్రాణహాని ఉందని అత్త, బామ్మర్దిపై విజయారెడ్డి భర్త ఫిర్యాదు
అల్లుడు, అతని తల్లిదండ్రులపై మృతురాలి తల్లి ఫిర్యాదు
నవతెలంగాణ-బోడుప్పల్
హైదరాబాద్ చర్లపల్లి రైల్వే ట్రాక్‌పై గత జనవరి 30న ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పిన్నింటి విజయశాంతిరెడ్డి కేసు కొత్త మలుపు తిరిగింది. తన భార్య విజయశాంతి, కూతురు చైతన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి మరణానికి తన బావమరిది వడకళ్ల చిరంజీవి, అతని భార్య లక్ష్మి, అత్త పుష్పవతి కారణమని ఆమె భర్త సురేందర్ రెడ్డి ఆరోపించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబారులో ఉద్యోగం చేసుకుంటూ ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడినని, తన భార్య సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ పిల్లల చదువులు చూసుకునేదని తెలిపారు. బావమరిది చిరంజీవి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తమ డబ్బు పెట్టడంతో ఆర్థిక లావాదేవీల వివాదాల కారణంగా తన భార్య తీవ్ర మానసిక వేదనకు గురైందన్నారు. దాంతో పిల్లలతో కలిసి అత్యంత దారుణ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ఘటన జరిగిన రోజు ఇంట్లో ఉన్న కోటి నలభై లక్షల రూపాయలు, కేజీన్నర బంగారం, ఆస్తి పత్రాలు కూడా దాచిపెట్టారని, తమ ఆస్తిని చేజిక్కిం చుకోవడానికే కుట్ర పన్నుతున్నారంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించి రక్షణతోపాటు న్యాయం చేయాలని కోరారు. తన భార్య చనిపోయాక కూడా ఆస్తి కోసం తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
అల్లుడి వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య మృతురాలి తల్లి ఆరోపణ
అల్లుడు సురేందర్‌రెడ్డి, వాళ్ల తల్లిదండ్రులు సులోచన, భగవంత్‌రెడ్డి వేధింపుల కారణంగానే తమ కూతురు విజయశాంతిరెడ్డి, మనవరాలు, మనవడు ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి తల్లి వడికళ్ల పుష్ప మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పెండ్లి అయిన నాటి నుంచే తమ కూతురును మానసికంగా ఇబ్బం దులు పెట్టేవారని, అప్పటి నుంచి తమ దగ్గరుండి చదువు పూర్తి చేసుకుందని తెలిపారు. తమ కూతురు బాగుండాలనే ఉద్దేశంతో ఇల్లు నిర్మించి ఇచ్చామని, అయినా వేధింపులకు గురి చేయడంతోనే ఆమె పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. పోలీసులు దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయా లని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇరువురి ఫిర్యాదులపై సీఐ చింత శంకరయ్య స్పందిస్తూ.. ఇది సివిల్ వివా దామని, కోర్టులో పరిష్కరించుకోవాలని అన్నారు.
విజయారెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త మలుపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



