Tuesday, April 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'డబుల్‌' దుకాణాల వేలం ఆపాలి

‘డబుల్‌’ దుకాణాల వేలం ఆపాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సీపీఐ(ఎం) నేతల వినతి
– వేలం నిధులను కలెక్టర్‌, కాలనీ సొసైటీల సంయుక్త ఖాతాలో వేస్తామన్న మంత్రి
నవతెలంగాణ-కాప్రా

డబుల్‌ బెడ్‌రూమ్స్‌ కాలనీల్లోని వాణిజ్య దుకాణాల వేలం, అమ్మకాలను నిలిపివేసి, వాటిని లబ్దిదారులకు కిరాయికి ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ, హౌసింగ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సీపీఐ(ఎం) మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శ్రీనివాసులతోపాటు జూలకంటి వెళ్లి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌రూమ్‌ సముదాయాల్లో పేద, బలహీన తరగతుల ప్రజలు నివసిస్తున్నారని, వారి సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని 12 డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీల్లో ఉన్న 892 వాణిజ్య దుకాణాలను ఏప్రిల్‌ 15, 17 తేదీల్లో వేలం వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని చెప్పారు. దుకాణాల కిరాయిల ద్వారా వచ్చే ఆదాయంతో లిఫ్టులు, ఇతర నిర్వహణ పనులు నిర్వహించొచ్చని, అమ్మకాల వల్ల ఈ అవకాశాన్ని కోల్పోతామని అన్నారు. భవిష్యత్‌లో కిరాయిల విలువలు పెరిగే అవకాశాన్ని కూడా లబ్దిదారులు కోల్పో తారని, వాణిజ్య సముదాయాల ద్వారా వచ్చిన నిధులను ఇతర అభివృద్ధి పనులకు వినియోగిసే.. తరువాత ఇక్కడ కాలనీల్లో నిర్వహణ భారం ప్రజలపై పడుతుందన్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే దుకాణాల వేలం అమ్మకాలను నిలిపివేసి, కాలనీల్లో అభివృద్ధి పనులు, మరమ్మతులు, నిర్వహణ కోసం ప్రత్యేక కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని, ఎస్టీపీల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మంత్రి స్పందిస్తూ.. డబుల్‌ బెడ్‌రూమ్‌ హౌసింగ్‌ స్కీమ్‌ దుకాణా లను బహిరంగ వేలం ద్వారా విక్రయించే నిర్ణయం తీసుకు న్నామని తెలిపారు. వేలం ద్వారా వచ్చిన నిధులను జిల్లా కలెక్టర్‌, కాలనీ సొసైటీల సంయుక్త ఖాతాలో జమ చేసి, ఆ నిధులపై వచ్చే వడ్డీతో కాలనీల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -