Tuesday, April 14, 2026
E-PAPER
Homeక్రైమ్ఛత్తీస్‌గఢ్‌ కాల్పుల్లో మావోయిస్టు భాగ్య మృతి

ఛత్తీస్‌గఢ్‌ కాల్పుల్లో మావోయిస్టు భాగ్య మృతి

- Advertisement -

– స్వస్థలం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం
– కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు
– చివరి చూపు కోసం మృతదేహాన్ని తీసుకురావాలని వినతి
నవతెలంగాణ-మిరుదొడ్డి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన భాగ్య అలియాస్‌ రూపి మృతిచెందారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ఏరియా కమాండర్‌ భాగ్య మృతిచెందారు. ఆమె 2004లో మావోయిస్టు పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆమె మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఏరియా కమాండర్‌ వరకు ఎదిగారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31లోపు లొంగిపోవాలని పిలుపునిచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు మావోయిస్టులు మాత్రం లొంగిపోవడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గడ్‌లోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భాగ్య మృతిచెందినట్టు అధికార వర్గాలు తెలపడంతో, ధర్మారం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన భాగ్య కుటుంబ సభ్యులు చివరి చూపుకైనా మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చే విధంగా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. సుమారు 24 ఏండ్లు అజ్ఞాతంలో ఉన్న భాగ్య.. ఇంటికి తిరిగి వస్తుందని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు కంటనీరే మిగిలింది. కూతురి ఆఖరి చూపు కోసం రోదిస్తూ ఎదురుచూస్తున్నారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు భాగ్య మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -