- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 10వ తరగతి పరీక్షలు ఇటీవల ముగిశాయి. ఫలితాల విడుదలకు విద్యాశాఖ వేగంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయిందని సమాచారం. సైన్స్, సోషల్ సబ్జెక్టుల వాల్యుయేషన్‌తో పాటు స్కానింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పనులు ఏప్రిల్ 25లోపు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో మే మొదటి వారంలోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు ప్రకటించగా, త్వరలో టెన్త్ ఫలితాలు రానున్నాయి.
- Advertisement -



