- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో భూకంపం సంభవించింది. నెవాడా రాష్ట్రంలో నమోదైన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7గా నమోదైంది. భూకంప కేంద్రం సిల్వర్ స్ప్రింగ్స్‌కు తూర్పు-దక్షిణ దిశగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు USGS తెలిపింది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపంతో ప్రకంపనలు తీవ్రంగా అనిపించాయి. ముఖ్యంగా రెనో నగరంలో భవనాలు స్వల్పంగా కంపించినట్లు సమాచారం. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి అధికారిక సమాచారం లేదు.
- Advertisement -



