- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధి నారాయణదాస్‌గూడలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి తల్లి, కుమార్తె మృతి చెందారు. వంట చేస్తుండగా ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించడంతో లావణ్య (40), కుమార్తె పావని (15) తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా లావణ్య మార్గమధ్యలో మృతి చెందగా, పావని చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనలో భర్త శ్రీనివాస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ ఆన్ చేసి వంట చేయమని చెప్పి వాష్ రూమ్‌కు వెళ్లాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



