- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలో తిరిగే తెలంగాణ బస్సుల్లో ఛార్జీలను సవరించినట్లు అధికారులు తెలిపారు. గతంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దూరాన్ని బట్టి ఛార్జీలు రూ.20-130 అధికంగా వసూలు చేసేవారు. ఇకపై ఈ ఛార్జీలను తగ్గించి, ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల మేరకే వసూలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి రోజూ విజయవాడ, తిరుపతి, కర్నూలు, విశాఖ వంటి నగరాలకు వందలాది తెలంగాణ బస్సులు నడుస్తున్నాయి. ఈ ఛార్జీల తగ్గింపుతో ఏపీ ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది.
- Advertisement -



